పెళ్లి జరిగేటప్పుడు తాళి కట్టిన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్ళి కూతురికి ఉంగరం తొడుగుతాడు. ఎందుకు అదే వేలికి ఉంగరం తొడగాలి అనే ప్రశ్న రేజ్ అయినప్పుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరణ తర్వాత భార్యభర్తలకు మద్య ఉన్న బంధం అంత బలమైనదా అనిపించింది.నేనైతే ఆ వివరణ తర్వాత ఆయన చెప్పినట్టు ట్రై చేసి ఆశ్చర్యపోయాను.
మీరూ ఇలా ట్రై చేయండి భార్యభర్తల బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే.
- రెండు చేతులకు ఉన్న అయిదు, అయిదు వేళ్ళను చాచండి.
- ఇప్పుడు మద్య వేలును సగానికి వంచి .. మొత్తం ఒకదానితో ఒకటి టచ్ చేయండి.
- మిగిలిన నాలుగు వేళ్లను కూడా ఒకదానితో టచ్ అయ్యేలా చేయండి.
- ఇప్పుడు బొటన వేళ్ల ను విడదీయండి..ఈజీగా విడిపోతోంది ఎందుకంటే వాళ్లు మీ తల్లీదండ్రులు చివరి వరకు మీతో ఉండరు.
- ఇప్పుడు చూపుడు వేళు విడదీయండి .ఇది కూడా ఈజీగా విడిపోతోంది. వీళ్లు మీ సోదరుల లాంటివారు, వారు కూడా మీతో చివరిదాకా ఉండరు.
- ఇప్పుడు చిటికెన వేళ్లను విడదీయండి..ఇది కూడా ఈజీగా విడిపోతోంది, వీళ్లు మీ పిల్లలాంటి వారు, వారు కూడా మీతో చివరి దాకా ఉండరు.
- ఇప్పుడు ఉంగరపు వేళును విడదీసే ప్రయత్నం చేయండి. మద్య వేలును ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండ…. ట్రై చేశారా? అది అసాద్యం..అదే భార్యాభర్తల మద్య బంధం.
Nice
ReplyDelete